Telugu News

                                    `గబ్బర్ సింగ్` ఆడియో 
'గబ్బర్ సింగ్' ఆడియో వేడుకను భారీ ఎత్తున జరపడానికి నిర్మాత బండ్ల గణేష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆది నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశానికి ప్రత్యేకతను ఆపాదించుకుంటూ వచ్చారు. వాళ్లు శ్రద్ధ తీసుకున్నరేంజ్ లోనే ప్రేక్షకుల నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు కూడా మిగతా చిత్రాల ఆడియో ఫంక్షన్స్ కి భిన్నంగా ఈ వేడుకను నిర్వహించాలనే ఉద్దేశంతో, ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఈ ఆడియో వేడుకకి ఏప్రిల్ 7 వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. పవన్ కళ్యాన్ అభిమానులకి నిరాశ కలిగించకూడదనే ఉద్దేశంతో, ఒకే రోజున తిరుపతి ... వైజాగ్ ... హైదరాబాద్ ... ప్రాంతాల్లో ఏ వేడుక జరపడానికి ప్లాన్ చేశారు.

ఈ వేడుకను ఉదయం - తిరుపతిలో, సాయంత్రం - వైజాగ్లో, రాత్రి - హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు గణేష్ తెలియజేశారు. ఇందుకోసం పవన్ కళ్యాన్ కి స్పెషల్ చార్టర్ విమానాన్ని సమకూరుస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏదేవైనా పవన్ కళ్యాన్ అభిమానులకి ట్రిపుల్ ధమాక అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరవిహారం చేసేస్తోంది. 'గబ్బర్ సింగ్' ఆడియోకే ఇంత హడావిడి చేసేస్తే ఇక సినిమా రిలీజ్ పరిస్థితి ఎలా ఉంటుందోననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

                                           'దరువు' వేస్తున్న రవితేజ
 రవితేజ కొత్త చిత్రం పేరు 'దరువు'. 'శౌర్యం' శివ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'దరువు' అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగు చెన్నయ్ లో జరిగింది.
రెండో షెడ్యులు షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనే ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రవితేజ పక్కన తాప్సీ కథానాయికగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతోంది.
                                     రివర్సయిన 'కొలవరి'. . !?
 శృతిహాసన్ అక్షరాలా తండ్రి అడుగు జాడల్లో నడుస్తోంది . నటనలో కాదండీ బాబూ ...ఏ గ్రేడ్ ఎఫైర్స్ లో ....! మొన్న మొన్నటి దాకా సిద్ధార్థ తో ఎఫైర్ సాగించిన శ్రుతి హాసన్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు 'ధనుష్ 'తో రాసుకు పూసుకు తిరుగుతోందట. వీరిద్దరి ఎఫైర్ పై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కధనం అటు కోలివుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ కూడా హాట్ టాపిక్ అయింది. 'త్రీ' చిత్రంలోని 'కొలవరి' పాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సాంగ్ జనానికి ఎంత ఫాస్ట్ గా చేరువైందన్న విషయం పక్కన పెడితే, అంతకన్నా ఫాస్ట్ గా ధనుష్ -శ్రుతి హాసన్ ఒకరికొకరు చేరువయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలోని శృంగార దృశ్యాలకి ఎలాంటి బెరుకు లేకుండా వీరిద్దరూ జీవం పోయడం ఈ టాపిక్ కి మరింతగా బలాన్నిచ్చింది.
      ఇక ఈ నెల 1 న జరిగిన ఐశ్వర్య (ధనుష్ భార్య, ఈ చిత్ర దర్శకురాలు) బర్త్ డే ఫంక్షన్ కి ధనుష్ హాజరు కాకపోవడం, అదే సమయంలో మరో ఫంక్షన్ లో ధనుష్ .. శ్రుతి హాసన్ తో కనిపించడంతో అంతా వీరి ఎఫైర్ ని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రజనీకాంత్ దంపతుల దృష్టికి వెళ్ళడంతో ... వాళ్లు కలత చెంది, ఈ విషయంలో ధనుష్ తల్లిదండ్రుల్ని కలిసినట్టు తెలుస్తోంది. ఏమైనా, 'త్రీ' సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఈ కథ ముగ్గురి మధ్య తిరుగుతూ, చిచ్చు పెట్టినట్టనిపిస్తోంది. దాంతో ధనుష్ పాడిన' కొలవరి' పాట రివర్సై ఐశ్వర్య పాడుకోవలసి వస్తోంది.
                                                                                             
                                      త్రిష ' పెళ్లి ' మాటలు
అందం ...అభినయం ...చిలిపిదనం ...చలాకిదనం ...వీటన్నిటి కేరాఫ్ అడ్రస్ 'త్రిష' అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటు అగ్ర కథానాయకులు, ఇటు యువ కథానాయకులు ఆమెతో కలిసి నటించడానికి ఇష్ట పడుతుంటారు... ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక త్రిష తెరపై కనిపిస్తే చాలు, కుర్రకారు ప్రేక్షకులు ఏదో తెలియని నిష కి లోనవుతారు. ఆమె రూపాన్ని వాళ్ళు కళ్ళతోనే ఆహ్వానిస్తారు... గుట్టుగా గుండెల్లోనే దాచేస్తారు. అలాంటి అభిమానులకీ ఆమె పెళ్లి గురించిన మాటలు కలవరపాటుని కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ఇటివల కాలంలో ఇండస్ట్రీలో త్రిష పెళ్లి గురించిన వార్తలు హల్ చల్ చేయడంతో అందరిలోనూ అది హాట్ టాపిక్కై కూర్చుంది.
    ' దమ్ము' సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉన్న త్రిష దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ... ఆమె నవ్వుతూనే స్పందించింది. పెళ్ళనేది గుట్టుచప్పుడు కాకుండా జరిగేది కాదనీ ...తన పెళ్లి అందరికి తెలిసేలానే జరుగుతుందని ఆమె సమాధానమిచ్చింది .ప్రస్తుతం కెరియర్ గురించి తప్ప పెళ్ళిగురించి ఆలోచించడం  లేదని  ఆమె ఈ ప్రచారానికి తెరదించింది. కాబట్టి' త్రిష 'ను  ఊహాసుందరిగా ఆరాధించే అభిమానులు హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు! సంక్రాంతికి పలకరించబోతున్న 'బాడీగార్డ్'లో ఆమె అందచందాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు

                           మాఫియా డాన్‌గా ` వెంకీ `. . .
       విక్టరీ వెంకటేష్, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోందనే విషయం తెలిసిందే. పరుచూరి ప్రసాద్ నిర్మించబోయే ఈ చిత్రానికి వెంకీ చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విభిన్న తరహా చిత్రాలపై దృష్టి సారించిన వెంకటేష్ తన కెరీర్లో తొలిసారిగా డాన్ పాత్రలో కనిపించనున్నారు. తన వయసుకు తగిన పాత్ర కావడంతో దీనిపై ఎంతో ఎక్స్టైటింగ్ ఉన్నాడట వెంకీ.
మెహర్ రమేష్ గతంలో ‘బిల్లా’ చిత్రంలో ప్రభాస్ ను డాన్ గా చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కాస్త నిరాశ పరిచినా, ఆ సారి మాత్రం వెంకటేష్ కోసం పక్కా స్క్రిప్టుతో రెడీ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. రీచా గంగోపాధ్యాయ ఇందులో హీరోయిన్ గా ఎంపిక కాగా, జగపతి బాబు ముఖ్య పాత్రను పోషించనున్నాడు. కోన వెంకట్, గోపీ మోహన్ ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ డైలాగులు రచించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ప్రస్తుతం వెంకీ నటించిన ‘బాడీగార్డ్’ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో వెంకీ సరసన త్రిష్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది.   
                             'బొబ్బిలి బ్రహ్మన్న' సీక్వెల్ లో ప్రభాస్?
ప్రస్తుతం 'రెబల్', 'వారధి' చిత్రాలలో నటిస్తున్న యంగ్ స్టార్ ప్రభాస్ త్వరలో ఓ సీక్వెల్ లో నటిస్తాడంటూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. గతంలో వాళ్ల పెదనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు నటించిన 'బొబ్బిలి బ్రహ్మన్న' చిత్రానికి సీక్వెల్ నిర్మించే ప్లానింగ్ జరుగుతోంది.
అప్పట్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని కృష్ణంరాజే నిర్మిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందట. ఇందులో ప్రభాస్ తో బాటు ఓ కీలక పాత్రలో కృష్ణంరాజు కూడా నటిస్తారని అంటున్నారు. నేటి యంగ్ డైరెక్టర్ ఒకరు దీనికి దర్శకత్వం వహించే అవకాశం వుంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.        
      
                                    'రచ్చ' ఓవర్సీస్ బిజినెస్ . . . ?
ఏడాది క్రితం రిలీజయిన 'ఆరెంజ్' సినిమా ఫ్లాపయినా కూడా, బిజినెస్ పరంగా హీరో రామ్ చరణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే అంటున్నారు. ప్రస్తుతం తను నటిస్తున్న 'రచ్చ' సినిమా బిజినెస్ బాగానే జరుగుతోందట. ఈ సినిమా ఓవర్సీస్ పంపిణీ హక్కులు రెండు కోట్ల 75 లక్షలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

 హరి వెంకటేశ్వరా పిక్చర్స్ ఈ హక్కులు సొంతం చేసుకుంది. సంపత్ నంది డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. రామ్ చరణ్, ఫైటర్లపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం షూటింగు శ్రీలంక, గోవా, బ్యాంకాక్, చైనాలలో జరిగిన సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.

                               క్రిష్-మహేష్ బాబు కాంబినేషన్లో `శివం`
సూపర్ స్టార్ మహేష్ బాబు గమ్యం, వేదం ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘శివం’ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
మహేష్ బాబు తాజా సినిమా ‘బిజినెస్ మేన్’ జనవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అనంతరం సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటి తర్వాత క్రిష్-మహేష్ బాబు కాంబినేషన్లో ‘శివం‘ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.డిఫరెంట్ కథాంశంతో ‘శివం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, గతంలో మహేష్ బాబు ఎన్నడూ కనిపించని విధంగా ఇందులో దర్శనం ఇవ్వబోతున్నాడని, విభిన్నమైన, విలువలతో కూడిన చిత్రాలు తీస్తాడని మంచి పేరు సొంతం చేసుకున్న క్రిష్ ఈ చిత్రం కోసం చాలా పక్బంధీ స్క్రిప్టు తయారు చేసుకున్నాడని తెలుస్తోంది.

                                               50 రోజుల ఫంక్షన్ లో `బాలయ్య` ఎమోషనల్. . . 
ఎన్టీఆర్‌ బిడ్డగా ఆ పాత్రకు న్యాయం చేయగలననిపించింది. బాపు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్టీఆర్‌ రక్తమే నాలో ప్రవహిస్తోందని ఆయనకు తెలుసు అంటూ ఎమోషనల్ గా శ్రీరామరాజ్యం 50 రోజుల ఫంక్షన్ లో మాట్లాడిన మాటలే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. నటన నా రక్తంలోనే ఉందని ఆయన చెప్పటం అభిమానలును ఆనందపరుస్తోంది. తన తండ్రి వారసత్వమే వచ్చిందంటూ బాలకృష్ణ.. 'జానపదమైనా, పౌరాణికమైనా, చారిత్రకమైనా, సాంఘికమైనా అన్ని రకాల పాత్రల్లో నాన్నగారు మెప్పించారు. అదంతా ఆయన మొదలుపెట్టిన ట్రెండే. ఆ దారిలోనే నేను నడుస్తున్నా.
బాపు దర్శకత్వంలో నాన్నగారు తన 52వ యేట 'శ్రీరామాంజనేయ యుద్ధంలో నటించారు. నేను కూడా ఇప్పుడు అదే వయసులో 'శ్రీరామరాజ్యం'లో నటించడం దైవసంకల్పం. 'లవకుశ' కథను మళ్లీ తీస్తానంటే నాకు ధైర్యం వచ్చింది. ఎన్టీఆర్‌ బిడ్డగా ఆ పాత్రకు న్యాయం చేయగలననిపించింది. బాపు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎన్టీఆర్‌ రక్తమే నాలో ప్రవహిస్తోందని ఆయనకు తెలుసు. మన సంస్కృతిని చాటిచెప్పే చిత్రమిది. ఈ సినిమా సాంఘికమా..? పౌరాణికమా..? అనేది చెప్పలేం. కానీ నాకు 'మాయాబజార్‌'లా అనిపించింది అన్నారు.

                                     ` బొంగు స్వామి`తో  ముమైత్ ఖాన్, నమిత. . . ?
      ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి త్వరలో ‘బొంగు స్వామి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు పోసాని. ఈ చిత్రంలో హాట్ లేడీస్ ముమైత్ ఖాన్, నమిత లీడ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. దొంగ బాబాల భాగోతంపై ఈ సినిమా రూపొందించనున్నారట. ఇప్పటికే తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల ఆదరణ పొందిన పోసాని...ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రతో పాటు, హీరో రోల్ లో కనిపించనున్నాడట.
గత సంవత్సరం  పోసాని  దర్శకత్వం వహించిన ‘దుశ్శాసన’ చిత్రం ప్లాపు కావడంతో ఈ సంవత్సరం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే నటుడిగా మాత్రం చాలా సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం పోసాని టింగరోడు చిత్రంలో హీరోగా..కృష్ణం వందే జగద్గురుమ్, అనుచరుడు, మిస్ చింతామణి తదితర చిత్రాల్లో సాధారణ పాత్రల్లో నటించబోతున్నాడు.
                                                ‘టాప్ లెస్’గా చార్మి ఫోటో షూట్. . .
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2 (సిసిఎల్2)ను పురస్కరించుకుని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా దేశంలోని అన్ని బాషలకు చెందిన హీరోయిన్లు....సిసిఎల్2 పేరుతో విడుదలయ్యే క్యాలెండర్ కోసం హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో హీరోయిన్ చార్మి కూడా ఉంది. ఇందులో రెడ్ కలర్ చీర కప్పుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది చార్మి. అయితే ఫోటో పైకి అలా ఉన్నా ఆమె లోదుస్తులు వేసుకుందని అంతా భావించారు. కానీ చార్మి ‘టాప్ లెస్’ గానే ఫోటోలకు ఫోజులు ఇచ్చిందనే విషయం తాజాగా బయ పడింది. పక్క ఫోటో చూశారుగా....టాప్ లెస్ గా ఎలా ఉందో. ఈ ఫోటో షూట్ లో చార్మి తన క్యాస్టూమ్స్ సర్దుకుంటుండగా ఫోటో గ్రాఫర్ కెమెరాకు చిక్కింది.
కాజల్ బాలీవుడ్ లో టాప్ లెస్ గా దర్శనం ఇచ్చినప్పుడే....చార్మి కూడా ఆమె మాటలోనే నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాజల్ పోకడపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో చార్మి వెనక్కి తగ్గిందని అన్నారు. అనుకోకుండా చార్మికి సిసిఎల్ పుణ్యమా అని టాప్ లెస్ ఫీట్ చేసే అవకాశం దక్కింది. ఇంకేం... సందెట్లో సడేమియాలా ఇలా టాప్ లెస్ గా రెచ్చిపోయి...అందరి చూపులు తన అందాలపై పడేట్లు చేసుకుంది. మరి చార్మి టాప్ లెస్ ఫీటు సినిమా అవకాశాల పరంగా ఆమెకేమైనా లాభాన్ని చేకూరుస్తుందో? లేదో చూడాలి మరి.


                                               నాగార్జున కంటతడి, సన్నిహితుల ఓదార్పు

మాతృమూర్తి అన్నపూర్ణమ్మ తనను, ఈ లోకాన్ని వీడి వెళ్లడంతో హీరో అక్కినేని నాగార్జున దు:ఖం ఆపుకోలేక పోయారు. సన్నిహితులు ఆయన్ను ఓదార్చారు. బుధవారం స్వర్గస్తులైన అన్నపూర్ణ అంత్య క్రియలు గురువారం ఇఎస్ఐ స్మశాన వాటికలో పూర్తయ్యాయి. కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జు, మనవడు సుమంత్ లు ఆమె చితికి నిప్పంటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అన్నపూర్ణ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.
పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు అన్నపూర్ణమ్మ చివరి చూపు చూడటానికి భారీగా తరలి వచ్చారు. అత్యంత సన్నిహితులను మినహా లోనికి ఎవ్వరినీ అనుమతించ లేదు.


                                                    రతి నిర్వేదం ఆంటీ నెట్ లో హల్ చల్. . . ?
శ్వేతా మీనన్. మలయాళ హాట్ ఆంటీ. ఈ  ఆంటీ నటించిన రతినిర్వేదం సినిమా ప్రస్తుతం తెలుగులోనూ విడుదలైన శృంగార ప్రేమికులను అలరిస్తోంది. వయసు పైబడిన మహిళ, తనకంటే చిన్న వాడైన కుర్రాడి మధ్య ప్రేమ కాని ప్రేమ, బంధం కానీ ‘సం’బంధం, ఉరకలెత్తే యవ్వన కోరికలు…తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
పెద్దలకు మాత్రమే పరిమితం అయిన ఈ సినిమాకు పెద్దల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. నాగార్జున రాజన్న సినిమాలోనూ శ్వేత మీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే…ఈ ఆంటీకి సంబంధిచిన ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పక్క ఫోటో చూశారుగా. అదన్నమాట మ్యాటర్.

                    మళ్లీ పుంజుకుంటున్న కాజల్ అగర్వాల్ . . ! 
   'మగధీర' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన కాజల్, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అనుష్క లాంటి నెంబర్ వన్ హీరోయిన్ కి పెద్ద పోటీ ఇచ్చే స్థాయికి కూడా ఎదిగిపోయింది. హీరోలంతా కాజల్ నామజపం చేశారు. ఎంతయినా సరే తమ సినిమాల్లో తనే కావాలన్నారు. అయితే, ఈ ఏడాది మధ్యలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఓపక్క సమంతా, తమన్నాలు దూసుకురావడం... మరోపక్క తన సినిమాలు పరాజయంపాలవడం కాజల్ స్పీడుకి బ్రేక్ వేశాయి. ఒక్కసారిగా మళ్లీ పరిస్థితి మారిపోయింది.
       సమంతా, తమన్నా బిజీ అవడంతో తను ఖాళీ అయింది. సినిమాలు తగ్గాయి. నిన్నటి బిజీ పోయి తీరిక దొరికింది. ఇక కాజల్ పని అయిపోయిందనుకున్నారంతా.  మొన్నటి వరకు ఒక్క 'బిజినెస్ మేన్' సినిమా తప్ప మరే సినిమా ఆమె చేతిలో లేదు. అయితే, మళ్లీ ఆమె పరిస్థితి ఇప్పుడు తిరగబడింది. అయిపోయిందనుకున్నదల్లా మళ్లీ పుంజుకుంటోంది. యన్టీఆర్, శ్రీను వైట్ల సినిమా, రామ్ చరణ్, వినాయక్ సినిమా కొత్తగా వచ్చిచేరాయి. దాంతో ఆమె కెరీర్ బిజీగా మారి, మునుపటి వైభవం మళ్లీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. త్వరలో విడుదల అయ్యే 'బిజినెస్ మేన్' సినిమా విజయం, సాధిస్తే కనుక అది కాజల్ కెరీర్ కి మరింత ఉపయోగపడుతుంది!

                         'రచ్చ'లో రవిబాబు కామెడీ . . .
ప్రముఖ నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు అటు ఆర్టిస్టుగానూ, ఇటు డైరెక్టర్ గానూ కూడా తన టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు. వృత్తిపరంగా దర్శకుడిగానే ఎక్కువగా దృష్టి పెడుతున్నప్పటికీ, అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్లు వస్తే నటుడిగా కూడా తన తడాఖా చూపిస్తూనే వున్నాడు. అలాగే, తాజాగా రామ్ చరణ్ తేజా నటిస్తున్న 'రచ్చ' సినిమాలో కూడా రవిబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది.
 ఈ సినిమాలో ఓ వెరైటీ కామెడీ పాత్ర ఉండడంతో, దర్శకుడు సంపత్ నంది దానిని రవిబాబు చేత వేయించాలని అడిగాడట. తనకు కూడా అ పాత్ర నచ్చడంతో రవిబాబు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ ఇందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అతని సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇప్పటికి అరవై శాతం వరకు పూర్తయిందట. మార్చిలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

                            మరోసారి ప్రమాదానికి గురైన శ్రద్దాదాస్ . . ?
ఆర్టిస్టులకు షూటింగుల్లో ప్రమాదాలు జరుగుతుండడం మామూలు విషయమే. అయితే, ఒకే సినిమా షూటింగులో కథానాయిక శ్రద్దా దాస్ కి రెండు సార్లు యాక్సిడెంట్ అవడం మాత్రం గమనార్హం. వై.వి.యస్.చౌదరి నిర్మిస్తున్న 'రేయ్' సినిమా షూటింగులో ఆమధ్య కంటికి దెబ్బ తగిలించుకున్న శ్రద్దా, తాజాగా మళ్లీ తలకి తగిలించుకుంది. ఈ సినిమా షూటింగు బ్యాంకాక్ లో జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
      లైట్ కట్టర్ ప్రమాదవశాత్తూ తలపై బలంగా పడడంతో ఆమెకు బ్లీడింగ్ అయింది. దాంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళగా చికిత్స చేసి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సలహా ఇచ్చారట. అయితే, తన వల్ల అంత దూరంలో షూటింగు కేన్సిల్ అవడం ఇష్టం లేక, వెంటనే ఆమె తిరిగి షూటింగులో పాల్గొందట. చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, ఆఫ్రికన్ సింగర్ గా శ్రద్దా దాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

                          పవన్‌తో ఐటంకు రూ.కోటి అడుగుతున్న హీరోయిన్ . . .
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ ‘దబాంగ్’ సినిమాకు ఇది రీమేక్.

దబాంగ్ సినిమాలో ‘మున్ని బదనాం హుయే’ పాటను గబ్బర్ సింగ్ లో ప్లాన్ చేశారు. ఈ ఐటం సాంగు చేయడానికి బాలీవుడ్ సెక్స్ బాంబ్ బిపాస బసును సంప్రదించారు దర్శక నిర్మాతలు. దర్శకుడు హారిష్ శంకర్ సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం బిపాస ఈ ఐటం సాంగు చేయడానికి రూ. కోటి డిమాండ్ చేసిందని, అయితే రూ. 50 లక్షలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్దం అయ్యారని, సంగం డబ్బుతో నా అందాలను పవన్ కళ్యాణ్ సినిమా కోసం దార పోయలేనని బిపాస తేల్చి చెప్పినట్లు సమాచారం.


                               2011 @ టాలీవుడ్ హిట్లు-ప్లాపులు 
టాలీవుడ్ లో 2011 సంవత్సరంలో దాదాపు 80 తెలుగు సినిమాలు రూపొందించబడ్డాయి. చెప్పుకోవడానికి ఈ సంఖ్య పెద్దగా ఉన్నా, అందులో విజయం సాధించినవి మాత్రం వేళ్లపై లెక్క పెట్టొచ్చు. చాలా సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో తెలుగు సినిమా కలెక్షన్ల మోత మోగించిందని చెప్పవచ్చు. ప్రథమార్థం అంతా మిరపకాయ్‌, అలా మెుదలైంది, అహనా పెళ్లంట, 100% లవ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, వీర వంటి చిత్రాలు సేఫ్‌జోన్‌లో నిలబడగా ద్వితీయార్థంలో విడుదలైన ‘దూకుడు’ బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా టాప్‌ గ్రాసర్‌ చిత్రంగా నిలిచి శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. 5 సంవత్సరాలుగా హిట్స్‌తో దోబూచులాడిన మహేష్‌బాబుకు ఇండస్ట్రీ టాప్‌ గ్రాసర్‌ చిత్రాలలో ఒకటిగా ‘దూకుడు’ చిత్రం నిలిచి పోయింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రథమార్థంలో వచ్చిన ‘శక్తి’ అపజయం మిగల్చగా ద్వితీయార్థంలో వచ్చిన ‘ఊసరవెల్లి’ కలెక్షన్ల పరంగా ఊరటనిచ్చింది. బాలకృష్ణకు ప్రథమార్థంలో ‘పరమవీరచక్ర’ చేదు అనుభవాన్ని మిగిలిస్తే ద్వితీయార్థం వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం కొత్త ఊపునిచ్చింది. అల్లు అర్జున్‌ నటించిన బధ్రీనాధ్‌ ఈ సంవత్సరం అంచనాలను అందుకోలేకపోయింది. ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. రవితేజకు మిరపకాయ్‌ హిట్‌గా నిలిస్తే ‘వీర’ సినిమా యావరేజ్‌గా పోయింది.
నాగార్జునకు గగనం సినిమా ఎబో యావరేజ్ సినిమా నిలిచింది. రగడ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. తాజాగా విడుదలైన రాజన్న ఫర్వాలేదనే టాక్ తో ముందుకు సాగుతోంది. రాజన్న సినిమా పూర్తి ఫలితం తేలాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్, పంజా చిత్రాలు యావరేజ్ చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. నాగ చైతన్యకు 100%లవ్ హిట్టిస్తే...దడ, బెజవాడ సినిమాలు ప్లాపుగా నిలిచాయి.
వరుణ్‌సందేశ్‌ నటించిన కుదిరితే ఓ కప్పు కాఫీ, బ్రహ్మిగాడి కథ, ప్రియుడు చిత్రాలు మూడు బిలో యావరేజ్‌గా పేరు తెచ్చుకున్నాయి. నానీ నటించిన అలా మొదలైంది సూపర్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. పిల్ల జమిందార్‌ ఎబోవ్‌ యావరేజ్‌ హిట్‌గా నిలిచింది. సెగ ఫ్లాపయ్యింది. సునీల్‌ నటించిన కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు దొంగలబండి చిత్రాలు ఫ్లాపయ్యాయి. కృష్ణుడు నటించిన వైకుంఠపాళి, నాకు ఓ లవరు ఉంది చిత్రాలు రెండూ ఫ్లాపయ్యాయి. నిఖిల్‌ నటించిన వీడు తేడా 4వారాలు దాటి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.
అల్లరి నరేష్‌ ఎప్పటిలానే తన హవా నిలబెట్టుకున్నాడు. అహనాపెళ్లంట, సీమటపాకాయ్‌ చిత్రాలు హిట్‌ చిత్రాలుగా వసూళ్ల పంట పండిస్తే మడతకాజా, సంఘర్షణ డబ్బింగ్‌ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక హీరో రామ్‌ నటించిన కందిరీగ హిట్టయి కలెక్షన్లు కురిపించింది. సుమంత్‌కి గోల్కొండ హైస్కూల్‌ యావరేజ్‌గా టాక్‌ తెచ్చుకుంటే దగ్గరగా-దూరంగా, రాజ్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. విష్ణు నటించిన ‘వస్తాడు నా రాజు’ ఫ్లాప్‌ అయ్యింది. జగపతిబాబు నటించిన చట్టం, నగరం నిద్రపోతున్న వేళ చిత్రాలు రెండూ అపజయం పాలయ్యాయి. శ్రీకాంత్‌కు శ్రీరామరాజ్యం హిట్టు దక్కినా అది బాలకృష్ణ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక విరోధి, దుశ్శాసన చిత్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. రానా నటించిన నేను నా రాక్షసి ఫ్లాపయింది. గోపీచంద్‌ నటించిన వాంటెడ్, మొగుడు చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. సిద్దార్థ నటించిన అనగనగా ఓ ధీరుడు, 180 చిత్రాలు ఫ్లాపవ్వగా ఓ మై ఫ్రెండ్‌ యావరేజ్‌గా నిలిచింది. నారా రోహిత్‌ నటించిన ‘సోలో’ ఎబోవ్‌ యావరేజ్‌ చిత్రంగా పేరుతెచ్చుకుంది.

                             'గబ్బర్ సింగ్' పొల్లాచ్చి షెడ్యూలు పూర్తి . . .
  'గబ్బర్ సింగ్' పొల్లాచ్చి నుంచి హైదరాబాదుకి తిరుగు ప్రయాణం అయ్యాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగు ముగిసింది. డిసెంబర్ రెండు నుంచి పొల్లాచ్చి పరిసరాల్లో ఈ సినిమా షూటింగు జరిగింది. పవన్, శృతి హాసన్ లతో బాటు మరి కొందరు ప్రధాన తారాగణం కూడా ఈ షూటింగులో పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, ఈ చిత్రంలో విలన్ పాత్రకు మొదట్లో ఎంపికైన సోనూసూద్ తప్పుకోవడంతో ఆ స్థానంలో 'రక్తచరిత్ర' ఫేం అభిమన్యు సింగ్ చేరాడు.

        'రక్తచరిత్ర'లో తన నటన నచ్చడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఫొటోలను పవన్ కల్యాణ్ కి చూపించారనీ, ఆయన ఇంప్రెస్ అయి, ఓకే చెప్పడంతో ఈ సినిమాలోకి వచ్చాననీ అభిమన్యు చెబుతున్నాడు. ఈ చిత్రం షూటింగు హైదరాబాదు, పొల్లాచ్చితో బాటు మహారాష్ట్రలోని పంచగని ప్రాంతంలో కూడా చేస్తున్నారు. 'దబాంగ్' ఒరిజినల్ లో సల్మాన్ నటించిన మార్కెట్ సీన్స్ పంచిగనీలోనే చిత్రీకరించారు. ఇందులో శృతి హాసన్ గ్రామీణ యువతిగా నటిస్తోంది.
                              ‘శ్రీరామ రాజ్యం’ బంపర్ ఆఫర్. . ?
బాలయ్య నటించిన శ్రీరామ రాజ్యం సినిమా విజయ వంతంగా 50 రోజుల వేడుకకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాత యలమంచిలి సాయిబాబు 1 నుంచి 10వ తరగతి వరకు గల స్కూలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సోమవారం(డిసెంబర్ 26) నుంచి వారంలో ప్రతి నాలుగు రోజులు(సోమ, మంగళ, బుధ, గురు) టిక్కెట్ రేటులో సగం ధరకే సినిమా చేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు వారి స్కూలు యాజమాన్యాల ద్వారా వారి వారి ప్రదేశములలో ఉన్న థియేటర్ల యాజమాన్యాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాముడిని దేవుడిగా ఎందుకు ఆరాధిస్తున్నామో నేటి యువతరానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈచిత్రం నిర్మించడం జరిగిందని, ధర్మ పాలన, అన్నదమ్ముల అనురాగం, భార్య భర్తల అనుబంధం, పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను ఎలా గౌరవించాలో, మనిషన్నవాడు పాటించవలసిన మానవతా విలువలు, ఆచరించవలసిన నీతి, నియమాలు, నిబద్ధత...ఇలాంటివి ఎన్నో రాముడిలో మనం చూస్తాం. ఆ విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేటి యువతరం ఈ సినిమా ద్వారా చూసి తెలుసుకోవాలని, వాటిని అలవరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పిల్లలను ఈ సినిమా చూసే దిశగా ప్రోత్సహించాలని కోరారు. 
                                          శ్రీవారి కోసం చరణ్-తమన్నా....
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని సినీ తారలు రామ్ చరణ్, తమన్నాలు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. రచ్చ సినిమా షూటింగులో భాగంగా తిరుపతి వచ్చిన ఈ ఇద్దరు పనిలో పనిగా ఏడుకొండలవాడి ఆశీర్వాదం తీసుకున్నారు. దర్శనానికి ముందు మీడియా ప్రతినిధులు రామ్ చరణ్ తో మాట్లాడానికి ప్రయత్నించగా చెర్రీ కోపంగా కసురుకుని, దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. తన పెళ్లి గురించి, ఉపాసన గురించి మీడియాలో వస్తున్న కొన్ని అభ్యంతరకర వార్తల నేపథ్యంలోనే చరణ్ ఇలా ప్రవర్తించినట్లు స్పష్టం తెలుస్తోంది.
రచ్చ సినిమాకు ఏమైంది ఈ వేళ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన తమన్నా రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో తన తండ్రి చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ పాట రీమిక్స్ లో చరణ్ స్టెప్పులేయనున్నాడు. చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడీ పెట్ట…’ పాటను రీమిక్స్ చేసి ‘మగధీర’ సినిమాలో స్టెప్పులేసి క్రేజ్ పెంచుకొన్న మెగాపవర్ స్టార్ మళ్ళీ రచ్చతో రచ్చచేసేయనున్నాడు. రచ్చ సినిమాను మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ప్రసాద్ జైన్, ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆర్ బి చౌదరి ఈ చిత్రానికి సమర్పకులు. మణి శర్మ సంగీతం అందించారు.

            అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న లక్స్ పాప..!
సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. తమ ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో కొందరు ఎంత రెచ్చిపోయి ఆరబోసినా...అడ్రస్ లేకుండా పోయినా వాళ్లు సైతం ఉన్నారు. తాజాగా మరో భామ ఈ రూట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప, లక్స్ పాప అంటూ చిందేసిన ఆశాషైనీకి ఆ తరువాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ ఇచ్చిన దాఖలాలు లేదు.

ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నా మార్పు మారలేదు. దీంతో ఇలా హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ తన పిటపిటలాడే అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోందీ భామ. వారం రోజుల కిందట వైట్ డ్రెస్ లో తనలోలోపలి అందాల్సి, సెక్సీ తనాన్ని ప్రదర్శించిన మయూరి, ఇప్పుడలా బ్లాక్ డ్రెస్ తో... బాప్ రే అనిపిస్తోంది. మరి ఈవిడ ఆరబోస్తున్న అందాలను చూసైనా...ఏ నిర్మాతో, దర్శకుడులో ముందుకు వస్తాడో? లేడో?


                     సెక్సీ గా తయారవ్వడం కోసం ఐశ్వర్య పాట్లు..!
మహిళలు గర్భం ధరించి, బిడ్డకు జన్మిస్తే కాస్త లావెక్కి.....అంతకు ముందు ఉండే సెక్సీ ఫిగర్ ను కోల్పోతారనే విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య రాయ్ విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే పండండి పాపాయికి జన్మిచ్చిన ఐష్, కాస్త లావెక్కి బొద్దుగా మారింది. ప్రస్తుతం ఆమె ఉన్న స్థితి హీరోయిన్ గా సెట్ కాదు. ఈ నేపథ్యంలో మళ్లీ హీరోయిన్ గా రాణించాలని చూస్తున్న ఐశ్వర్య రాయ్ స్లిమ్ గా, సెక్సీగా తయారయ్యేందుకు సమాయత్తం అవుతోంది.
మరో వైపు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి సినిమా ఆఫర్ కూడా రావడంతో...వీలైనంత త్వరగా తన ఫిగర్ షేపును మార్చుకోవాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు మళ్లీ డైటింగులు, ఎక్స్ సైజులు మొదలు పెట్టినట్లు బాలీవుడ్ సమాచారం. ఇటీవలే ఐశ్వర్యను కలసిన సంజయ్‌లీలా భన్సాలీ హీరోయిన్ ఓరియెంటడ్‌ కథ చెప్పినట్లు, ఐశ్వర్య కూడా ఆ సబ్జెక్ట్‌ను ఓకే చేసిందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘హమ్ దిల్ దే చుకే సనమ్, దేవ్‌దాస్, గుజారిష్ లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.


                              ఆఫర్స్ వెనుక రహస్యం ఏంటి..?
దేన్నయినా తేలిగ్గా అర్థ చేసుకోగలను..అదే నా బలం కూడా తొలి సినిమా ‘లీడర్’ నుంచి తమిళ సినిమాలు ‘ఓస్తి’, మయక్కమ్ ఎన్న’ సినిమాల వరకూ..ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విషయం కొత్తగా నేర్చుకుంటున్నా..’అని అంటోన్న ‘లీడర్’ భామ రిచా గంగోపాధ్యాయ్..కెరీర్ లో హిట్టూ ప్లాపూ సహజమేననీ..నటిగా తానిప్పుడు వున్న పొజిసన్ కి చాలా ఆనందంగా వుందనీ చెప్పుకొచ్చింది.  ‘ఒస్తి’, ‘మయక్కమ్’ ఎన్న సినిమాలు కెరీర్ లో తనను టాప్ ప్లేస్ లో నిలబెడ్తాయనే ధీమాతో వుంది రిచా గంగోపాధ్యాయ. టాలీవుడ్ నుంచి అవకాశాలొస్తున్నాయనీ, నాలుగైదు ప్రాజెక్టులు డిస్కషన్స్ లో వున్నాయని రిచా గొంగోపాద్యాయ చెబుతోంది.
ఓ బాలీవుడ్ సినిమాకీ సైన్ చేసిన రిచా, నటనకు భాష అడ్డంకి కాదనీ, భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నటన తేలికవుతుందని అంటోంది. ఒకేసారి ఇన్ని అవకాశాలు రావడానిక ఆమె నటనా ప్రతిభ కొంత కారణమైతే మరో కారణం కూడా ఉంది. అదే రిచా ‘కలివిడితనం’. తెలుగు, తమిళ పరిశ్రమల్లో జరిగే పెద్ద పార్టీలకు తప్పనిసరిగా వెళుతుందట. అక్కడ అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి, ఆకట్టుకుంటోందని సమాచారం. సినిమా పరిశ్రమకి కావాల్సింది ఆ ఫ్రెండ్లీనెస్సే కాబట్టి..రిచా వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారట. ఫలితంగా ఉప్పడు డేట్స్ ఖాలీ లేనంతగా బిజీ అయ్యింది రిచా. తెలుగులో వెంకటేష్ సరసన ఒక సినిమా, ప్రభాస్ పక్కన ఓ సినిమా, గోపిచంద్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. ఇవి కాకుండా తమిళంలో కూడా చేస్తోంది.


                               దర్శక రత్న దాసరి నారాయణ రావుకు భార్యా వియోగం
ప్రముఖ దర్శకుడు, నటుడు దాసరి నారాయణ రావు భార్య దాసరి పద్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. దాసరి పద్మ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.


దాసరి పద్మ పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాసరి పద్మ మృతికి సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పద్మ లేని దాసరి నారాయణ రావును ఊహించుకోలేమని ప్రముఖ నటుడు, దర్సకుడు ఏవిఎస్ అన్నారు. ఆమె ఇంటికి వెళితే సాదరంగా ఆహ్వానించే వారని అన్నారు. ఆమె ఆత్మీయత మరువలేనిదన్నారు.

                            హీరోయిన్ తో సెక్సువల్ వేధింపులు
అల్లరి నరేష్ తో బ్లేడ్ బాబ్జీ చిత్రంలో చేసిన సయీలీ భగత్ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా తన తోటి నటుడు షైనీ అహూజా లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది.ఆమె తన తాజా చిత్రం ఘోస్ట్ లో చేస్తున్న షైనీ..తనతో చాలా సార్లు సినిమా షూటింగ్ లో మిస్ బిహేవ్ చేసాడని చెప్పుకొచ్చింది.ఇప్పటికే పనిమనిషితో లైంగిక గొడవల్లో కేసులో ఉన్న షైనీ ఆహూజాపై ఇది మరో వివాదం అయ్యికూర్చుంది. అయితే ఇంతకు ముందు ఆమె స్టార్ డస్ట్ వాళ్లు చాలా సార్లు ఈ విషయమై అడిగారని,తనతో షైనీ అసభ్యంగా బిహేవ్ చేసాడని రాసారని,నేను వాటిన్నటినీ ఇంటర్వూల్లో ఖండించాల్సి వచ్చింది.అలాగే వారు పత్రికలో రాసినట్లు తన బట్ ని తడమలేదని అంది.


అయితే షైనీ అహూజా భార్య ఇప్పటికే తన భర్త ఇటువంటి కేసులో ఇరుక్కుని ఉండటంతో సయీలీతో మాట్లాడి..ఆమె చేత ఇవన్నీ ఏమీ లేదు..అని చెప్పించాలనుకుంటోందంటూ బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. ఇక సయీలీకి హిందీలోనూ పెద్దగా సినిమాలు లేవు. ఆమె చేస్తున్న ఘోస్ట్ సినిమా ఓ హర్రర్ సినిమా.ఇక షైనీ అహూజా…పని మనిషిని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు 109 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి, బాధితురాలికి జరిపిన వైద్య, ఫోరెన్సిక్ నివేదిలను ఈ చార్జిషీట్ తో జతపరిచారు. బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి సహకరించినవారి, ఇరుగుపొరుగువారితో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా ఉన్నాయి.బాధితురాలి వాంగ్మాలాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారు. జూన్ 15వ తేదీ నుంచి షైనీ అహుజా గట్టి భద్రత మధ్య ఆర్థర్ రోడ్ సెంట్రల్ ముంబై జైల్లో ఉంచారు. జూన్ 14వ తేదీన అహుజా బాధితురాలిని నీళ్ల కోసం తన గదికి పిలిచి ఆమె లోనికి రాగానే గదికి గడియ వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు ఆరోపణ.
     
                         నాకు సమంతతొ వేరే రిలేషన్ లేదు

నా ఫేటే అలా ఉంది. ఇంతకుముందు సమీరా రెడ్డి అన్నారు.. ఇప్పుడు సమంత అంటున్నారు. నాకు సమంతతో ప్రొఫిషనల్ రిలేషన్ తప్ప వేరే ఏ విధమైనవి లేవంటూ ఖండించారు దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తాజా చిత్రంలో ఆమెను మూడు భాషలకు గానూ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయమై తమిళ పత్రికల్లో ఆమెకీ, దర్శకుడుకీ మధ్య వేరే విధమైన రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు వచ్చాయి. వాటిపై దర్శకుడు మాట్లాడుతూ ఇలా ఖండించారు.అలాగే ఇలాంటి రూమర్స్ వల్ల నా కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.


 నిజానికి సమంతలో కొద్ది నెలల క్రిందటకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఆమె మొదటి టేక్ లో సీన్ లు ఓకే చేసేస్తోంది.ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆమెతో సినిమా చెయ్యాలంటే నిర్మాతలు ఉత్సాహం చూపెడుతున్నారు.ఎంతలా అంటే హీరో ఎవరనేది కూడా అడగటం లేదు. అందుకే్ ఆమెను నా సినిమాలో తీసుకున్నాను.అంతకుమించి ఆమెపై నాకు స్పెషల్ ఇంట్రస్ట్ ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.ఇక నాని హీరోగా తెలుగు వెర్షన్ కి ఆయన చిత్రం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.

                             డిసెంబర్ 1 న రామ్ చరణ్ నిశ్చితార్ధం. . . 
  మెగా అభిమానులకు దీపావళి రోజున శుభవార్త. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ఉపాసనల వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 1 న జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ రోజు చిరంజీవి దంపతులు వెల్లడించారు.


 రాష్ట్ర గవర్నర్ నరశింహన్ కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ రోజు చిరంజీవి తన భార్య సురేఖ, తనయుడు చరణ్ లతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి గవర్నర్ కు ఈ శుభవార్తను తెలియజేశారు. తన ఎంగేజ్ మెంట్ వేడుకకు విచ్చేయాల్సిందిగా ఈ సందర్భంగా చరణ్ గవర్నర్ దంపతులను సాదరంగా ఆహ్వానించాడు. దీనికి గవర్నర్ దంపతులు ఆనందంగా అంగీకరించారు. చరణ్ నిశ్చితార్ధం నిజామాబాద్ సమీపంలోని దోమకొండ కోటలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాసన తాత గారి సంస్థానానికి చెందిన ఈ పురాతన కోటలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది.
                                 'బాడీగార్డ్' ఫస్ట్ లుక్
 వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'బాడీగార్డ్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ డిజైన్స్ లో వెంకటేష్ చాలా స్టయిలిష్ గా ఉన్నాడని అంటున్నారు. మలయాళంలో హిట్టయిన బాడీగార్డ్ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి మనకు తెలిసిందే.


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగు ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరుకి దీనిని రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతోంది. త్రిష ప్రదాన కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఇప్పటికే హిట్టయిన సంగతి తెలిసిందే!


                           ఛాన్స్ మిస్ అయిన సమంతా!

 మూడు వరుస విజయాలతో ఈ వేళ టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కి పోటీపడుతూ, పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న కథానాయిక సమంతా, తాజాగా ఓ పెద్ద దర్శకుడిని ఇంప్రెస్ చేయడంలో ఫెయిలయిందట. కోలీవుడ్ వర్గాల కథం ప్రకారం, ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం ఈ చెన్నయ్ సుందరిని రిజక్ట్ చేశాడట.


ఇంతకీ, అసలు విషయం ఏమిటంటే... నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్ హీరోగా తాను రూపొందించనున్న తెలుగు, తమిళ చిత్రానికి కథానాయికగా సమంతాను సెలెక్ట్ చేసుకున్నాడట మణిరత్నం. ఈ విషయం విన్న సమంతా కూడా ఆనందంతో ఎగిరిగంతేసి, మణిరత్నం పిలుపుపై స్క్రీన్ టెస్ట్ కోసం చెన్నయ్ వెళ్లిందట. అయితే, స్క్రీన్ టెస్ట్ లో ఆమె పెర్ఫార్మెన్స్ మణిరత్నాన్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదని అంటున్నారు. ఫిలిం మేకింగ్ లో ఎక్కడా రాజీపడని మణిరత్నం ఆమెను రిజక్ట్ చేసి, మరో అమ్మాయి కోసం వెతుకుతున్నాడని చెన్నయ్ వర్గాలు చెబుతున్నాయి. అలా మణి సార్ సినిమా చేసే చాన్స్ ను సమంతా మిస్ అయిందట!

                           'దూకుడు 20,000 '  సందడి. . .

మహేష్ బాబు కథానాయకుడుగా వచ్చిన 'దూకుడు' సినిమా తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్ల పరంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈ దీపావళిని స్పెషల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. అభిమానులతో ఈ ఆనందాన్ని పంచుకోవడానికి 'దూకుడు 20,000' వాలా సీమ టపాకాయలను పేలుస్తూ పండగ చేయనున్నారు.


 మామూలుగా సీమ టపాకాయల్లో ఇంతవరకు 10,000 వాలాలే మనకు తెలుసు. అయితే, ప్రత్యేకంగా 20,000 వాలా సీమ టపాకాయలను శివకాశిలో ఆర్డరిచ్చి మరీ చేయించారు చిత్ర నిర్మాతలు. హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, వైజాగ్, కాకినాడ, భీమవరం సెంటర్లలో ఈ దూకుడు 20,000 వాలా సీమ టపాకాయలను పేలుస్తూ అభిమానులు రేపు ఆయా థియేటర్ల వద్ద సందడి చేయనున్నారు.

                         నవంబర్ 13 న 'పంజా' ఆడియో . . .
 పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పంజా' సినిమా ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు. విష్ణువర్ధన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను నవంబర్ 13 న నిర్వహిస్తారు. చిత్రాన్ని డిసెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు.


ఇదిలా ఉంచితే, షూటింగుకు సంబంధించి ఇక ఒక పాట చిత్రీకరణ మాత్రం మిగిలి ఉందనీ, త్వరలోనే దానిని చిత్రీకరిస్తామనీ వారు చెప్పారు. మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయనీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అభిమానులను తప్పక అలరిస్తుందనీ నిర్మాతలు అన్నారు. పవన్ కల్యాణ్ పక్కన సారాజేన్ డయాస్, అంజలి లావానియా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నాడు.
                         ఇల్లీ బ్యూటీ ఏమాత్రం తగ్గలేదట..!

 గోవా బ్యూటీ ఇలియానాకు కోపం వస్తోంది. అలా అంటే తనని అవమానపరిచినట్టేనని అంటోంది. ఇంతకీ... ఏమిటా విషయం అనుకుంటున్నారా...  సినిమాలు లేకపోవడంతో ఈ గోవా అమ్మడు పారితోషికం తగ్గించుకుందంటూ ఇటీవల మీడియాలో వార్తలు రావడం ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అందుకే, ఈ విషయం మీద తాజాగా నోరువిప్పింది.


"నేనెప్పుడూ నాకింత కావాలని ఏ నిర్మాతనూ డిమాండ్ చేయలేదు. అలాగే, సినిమా చాన్సుల కోసం పారితోషికం తగ్గించుకోనూలేదు" అంటోంది ఇల్లీ బ్యూటీ. హిందీ చిత్రం 'బర్ఫీ'లో అవకాశం కోసం తాను రెమ్యునేరేషన్ ఏమాత్రం తగ్గించుకోలేదని చెబుతోంది. మార్కెట్లో తనకున్న డిమాండ్ ను బట్టి తనకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారనీ, అంతేకానీ, ఏవో సినిమాల కోసం తాను తగ్గించుకోవడం అంటూ ఏమీ లేదనీ ఇలియానా చెబుతోంది. మరి, ఈ మాటలు టాలీవుడ్ నిర్మాతలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!



                         మాస్ ఎంటర్ టైనర్ గా  రామ్ చరణ్, కాజల్ సినిమా
 ప్రస్తుతం 'రచ్చ' సినిమా చేస్తున్న రామ్ చరణ్, దీని తర్వాత వి.వి.వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలుసు. దీనికి సంబంధించిన కథా చర్చలు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఆకుల శివ అందించిన కథకు కోన వెంకట్ డైలాగులు రాస్తున్నాడట.


స్క్రిప్ట్ పూర్తయిందనీ, చిరంజీవి దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారనీ వార్తలొస్తున్నాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా దీనిని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'మగధీర' తర్వాత మళ్లీ కాజల్ ఇందులో చరణ్ పక్కన కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగును ప్రారంభిస్తారు.


                              దీపావళికి డబ్బింగ్ ధమాకా!

మామూలుగా ప్రతి పండుగకూ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. మనకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అది. అలాగే దీపావళికి కూడా కొందరు ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ ఈ దీపావళికి విడుదల కావడం లేదు. దాంతో, ఆ లోటును రెండు డబ్బింగ్ సినిమాలు తీరుస్తున్నాయి.


అందులోనూ ఆ రెండూ భారీ సినిమాలే! ఒకటి షారూక్ నటించిన హిందీ చిత్రం 'రా.వన్' కాగా, మరొకటి సూర్యా నటించిన తమిళ చిత్రం 'సెవెంత్ సెన్స్'. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ తో రూపొంది, భారీ అంచనాలతో వస్తున్నాయి. తెలుగు మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి వీటిని డబ్ చేసి, భారీ ప్రమోషన్ తో రిలీజ్ చేస్తున్నారు. రెండూ ఈ నెల 27 న విడుదల అవుతున్నాయి. మరి, ఈ చిత్రాలు ఎంతవరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి!



                             నెలకొక సినిమాతో వస్తున్న దీక్షా సేథ్
 కాస్త లేట్ అయినా పొడుగు కాళ్ల సుందరి దీక్షా సేథ్ కి అంతా మంచే జరుగుతోంది. మిరపకాయ్ విడుదల అవగానే ఆఫర్లు రాకపోయేసరికి బెంబేలెత్తిపోయిన దీక్షాకు ఇప్పుడు ఊపిరిసలపనంతగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. తన పొడుగే తనకు మైనస్ అవుతుందేమో అనుకుని భయపడ్డ ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలు చేస్తూ బిజీగా వుంది.


 ప్రభాస్ తో 'రెబల్', రవితేజాతో 'నిప్పు', మనోజ్ తో 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా', విక్రంతో 'రాజా బాట్టాయ్', శింబుతో 'వేట్టాయ్ మన్నన్' చిత్రాలలో తానిప్పుడు నటిస్తోంది. ఈ సినిమాల ద్వారా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా పడుతోందట. ఈ ఐదింటిలోనూ ఒకటి ఈ ఏడాది విడుదలవుతుంటే, మిగతా నాలుగూ వచ్చే ఏడాది రిలీజ్ అవుతాయట. "వచ్చే ఏడాది విడుదలయ్యే నాలుగూ నెలకొకటి చొప్పున నాలుగు నెలల పాటు రిలీజ్ అవుతాయి. అంటే, ప్రతి నెలా తెర మీద నాదో కొత్త సినిమా ఉంటుందన్నమాట. తలచుకుంటే ఇదో థ్రిల్లింగ్ గా వుంది" అంటోంది దీక్షా సేథ్.
                     మరో ఐటెం గాళ్ ను తెస్తున్న ఆ దర్శకుడు. . . ?
 బాలీవుడ్ భామ, 'మిషన్ ఇస్తాంబుల్' ఫేం శ్వేతా భరద్వాజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్ మేన్' సినిమాలో శ్వేతా ఓ ఐటెం సాంగ్ చేస్తోంది. 'శ్రీరాముడు కాదు... శ్రీకృష్ణుడు కావాలి... వీ వాంట్ బ్యాడ్ బాయిస్...' అంటూ సాగే ఈ పాటను ప్రస్తుతం ముంబయ్ లో షూట్ చేస్తున్నారు.

 ఈ పాట చిత్రీకరణలో మహేష్ బాబు, శ్వేతా తదితరులు నటిస్తున్నారు. గతంలో 'పోకిరీ' సినిమాలో ముమైత్ ఖాన్ అందాలను ఆరబోయించిన దర్శకుడు జగన్, ఈ 'బిజినెస్ మేన్' లో శ్వేతాను మేగ్జిమం ఎక్స్ పోజ్ చేస్తున్నాడట. ఇది పూర్తయ్యాక గోవాలో క్లైమాక్స్ దృశ్యాలు షూట్ చేస్తారు. ముంబయ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు, కాజల్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

                            పోకిరీ ఆటకట్టించిన ప్రియమణి!
  కథానాయిక ప్రియమణి ఆ టెన్షన్ నుంచి ఇప్పుడు బయటపడింది. హాయిగా ఊపిరిపీల్చుకుంటోంది. ఇన్నాళ్లూ తనను వేధించిన పోకిరీ కటకటాల వెనక్కు వెళ్లడంతో రిలాక్స్ అయింది. అసలు విషయం ఏమిటంటే, గత రెండు మూడు నెలల నుంచీ ప్రియమణి మొబైల్ కి ఓ కుర్రాడు ఫోన్లు చేస్తూ ఆమెను మానసికంగా హింసిస్తున్నాడట.


 అసభ్యకరమైన ఎస్సెమ్మెస్ లు పంపడంతో బాటు, అభ్యంతరకర పదజాలంతో మాట్లాడడం చేస్తూ, ఆమెకు కుదురులేకుండా చేశాడట. మొదట్లో ఎవరో పిచ్చి ఫ్యాన్ అయివుంటాడని కొన్నాళ్లు భరించినా, ఆ పోకిరీ శృతి మించడంతో, రెండు సార్లు నెంబర్ మార్చిందట. ఇందువల్ల ఇండస్ట్రీ వాళ్లతో ఆమెకు కాంటాక్ట్ కూడా మిస్ అయింది. అయినా కూడా ఆ పోకిరీ కొత్త నంబర్లకు కూడా ఫోన్ చేస్తూ వేధిస్తుండడంతో ఇక భరించలేక పోలీస్ కంపైంట్ ఇచ్చింది. దాంతో, ఆ శాడిస్టు అభిమానిని పట్టుకుని పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారట. అలా ప్రియమణి ఆ వేధింపుల నుంచి బయటపడింది!


                         వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్యా, రవితేజ
చాలా మంది తమిళ దర్శకుల కళ్ళు ఈ మధ్య టాలీవుడ్ హీరో రవితేజా మీద పడుతున్నాయి. తమ కథలకు అతను హీరో అయితే బాగుంటుందని భావిస్తున్నారు. ఆ క్రమంలో అతని కోసం ట్రై చేస్తున్నారు కూడా. ఇటీవల అజిత్, త్రిష జంటగా 'మంకథ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వెంకట్ ప్రభు కూడా తన తదుపరి చిత్రం కోసం రవితేజాను ట్రై చేస్తున్నాడు.


తెలుగు, తమిళ భాషల్లో తాను రూపొందించనున్న చిత్రం కోసం ఇప్పటికే సూర్యాను తమిళ్ వెర్షన్ కోసం బుక్ చేశాడు. తెలుగు వెర్షన్ కి రవితేజా అయితే సరిగ్గా సూట్ అవుతాడని భావించి, అతనికి కథ వినిపించాడట. రవితేజా కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాడనీ, త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తాడనీ తెలుస్తోంది.

                            ప్యారిస్ లో 'ఎందుకంటే...ప్రేమంట'
ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ రూపొందిస్తున్న తాజా ప్రేమకథ 'ఎందుకంటే...ప్రేమంట'! కందిరీగ సినిమా తర్వాత హీరో రామ్ నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగు గత కొన్ని రోజులుగా యూరప్ లోని వివిధ లొకేషన్లలో జరుగుతోంది.


హీరో హీరోయిన్లపై స్విట్జర్లాండ్, జేనీవాలలో ఇటీవల కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ పారిస్ కి పయనమైంది. అక్కడ కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. స్రవంతీ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

                           'గబ్బర్ సింగ్' లో పార్వతి పాట. . . 
'గబ్బర్ సింగ్' లో 'మున్నీ' ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడిదే టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమా హిందీ ఒరిజినల్ 'దబాంగ్' లో మలైకా అరోరా ఖాన్ చేసిన మున్నీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయింది. ఆ పాట కోసమే సినిమా చూసిన వాళ్లు కూడా వున్నారు.


అందుకే, ఈ సినిమా తమిళ వెర్షన్ 'ఒస్తి'లో కూడా ఆ పాటను భారీగానే షూట్ చేశారు. 75 లక్షల పారితోషికం చెల్లించి, బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ మీద ఆ పాటను షూట్ చేశారు. అలాగే, తెలుగు వెర్షన్ 'గబ్బర్ సింగ్' లో కూడా ఈ పాటను రిచ్ గానే తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఐటెం గాళ్ గా బాలీవుడ్ భామను కాకుండా, పార్వతీ మెల్టన్ ను ఎంపిక చేసినట్టూ, పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఆమె కూడా ఓకే చెప్పినట్టూ తెలుస్తోంది. ఇటీవల 'దూకుడు' సినిమాలో పార్వతి చేసిన ఐటెం సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆమెనే ఫిక్స్ చేశారట!
             Pawan Kalyan`s Gabbar Singh on March 28
Pawan Kalyan’s Panjaa is in the post production work and his next movie Gabbar Singh is already on the sets. Some part of this film was already shot and it will be quickly wrapped up in another sixty days. This is the remake of Bollywood blockbuster Dabangg.


Harish Shankar is directing Gabbar Singh. This film is aiming at summer release. As per the buzz, Gabbar Singh will release on March 28, 2012. Shruti Haasan is the heroine in this film. Devi Sri Prasad is scoring the music.Ganesh Babu, who produced Theen Maar with Pawan Kalyan is producing this film. With Gabbar Singh slated for March 28 release, Pawan Kalyan’s fans are going to witness two releases in a span of four months.

                        Racha Next schedule in HYD

Mega Power Star Ram Charan’s upcoming Mass action entertainer 'Racha' has recently completed its schedule in Goa. Now the latest news is that next schedule of the movie will commence from 25th October in Hyderabad. Tamanna is paired up with Ram charan for this movie.


Racha is an out and out mass entertainer and it will have high voltage special action episodes. Allan-Amin, Ram Lakshaman and stun siva films are composing action episodes for Racha. The film’s first look will be unveiled in November and the audio is expected to release in December. Manisharma is scoring the music for this film.


                           ‘రామ్‌చరణ్‌’కు కట్నంగా చిన్న విమానం...!
రామ్‌చరణ్‌, ఉపాసనతో పెండ్లిచేసుకోన్నాడన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో నిశ్చితార్థం. అయితే ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. అతనికి కట్నం కింద 120కోట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. తమిళ పత్రికలో ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. మగధీరకు ధీటుగా కట్నకానుకలు వుంటాయని తెలిసింది. కట్నంతోపాటు చిన్న విమానంకూడా ఇవ్వనున్నారు.


జర్మనీలో తయారుచేస్తున్నారు. ఈనెలాఖరుకు హైదరాబాద్‌ రానుంది. ఇదిలావుండగా నిశ్చితార్థం కామినేని వంశీయులు అతిఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో స్టార్‌ హౌటల్స్‌ అన్నీ ఇప్పటికే బుక్‌చేసినట్లు సమాచారం.


                                   మీకు టచ్‌లో లేనందుకు సారీ..త్రిష....

గత ఇరవై రోజులుగా మీకు టచ్‌లో లేనందుకు సారీ. షూటింగ్‌తో బిజీగా ఉండటంవల్లే ఇలా జరిగింది’’ అని త్రిష అన్నారు. ఆమె సారీ చెప్పింది తన ట్విట్టర్ ఫాలోయర్స్‌కి. గత నెలాఖరున ఆమె కెనడా వెళ్లారు. వెంకటేష్, త్రిష జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ అక్కడ జరిగింది. ఇటీవలే కెనడా నుంచి చెన్నయ్ చేరుకున్నారు త్రిష. వచ్చీ రాగానే ముందుగా ఆమె చేసిన పని ఫాలోయర్స్‌కి క్షమాపణ చెప్పడం.


కెనడాలోని అందమైన ప్రదేశాల్లో ఈ షూటింగ్ చేసి వచ్చామని కూడా ఆమె చెప్పారు. అలాగే తనకు ఓ బుజ్జి కుక్కపిల్ల దొరికిందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కుక్కపిల్ల గురించి వివరంగా చెబుతూ -‘‘నాకు ఆడ కుక్క పిల్ల దొరికింది. చాలా ముద్దుగా ఉంది. బహుశా ఐదారు నెలల వయసు ఉంటుందేమో. ముద్దులొలికే ఈ బుజ్జి కుక్కపిల్ల ప్రస్తుతం నా దగ్గరే ఉంది. కానీ దానికి కావల్సింది నేను అప్పుడప్పుడు చూపించే ప్రేమాభిమానాలు కావు. ఎప్పటికీ రక్షణ ఇచ్చే ఓ గూడు కావాలి.
అందుకని ఎవరైనా ఆ శునకాన్ని దత్తత చేసుకుంటే బాగుంటుంది’’ అన్నారు. ఆ పనేదో తనే చెయ్యొచ్చు కదా అనుకుంటున్నారా? ఆల్రెడీ త్రిష ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. షూటింగ్స్‌కి గ్యాప్ దొరికినప్పుడల్లా ఆ కుక్కపిల్లను జంతు సంరక్షణ శాలకు తీసుకెళ్లి, జుత్తు ట్రిమ్ చేయించి, గోళ్లు కత్తిరించి, చక్కగా స్నానం చేయిస్తారట. ఇప్పుడు మరో కుక్కపిల్ల అంటే..టైమ్ కేటాయించడం కష్టం అని భావించి వేరేవాళ్లకి దత్తత ఇవ్వాలనుకున్నారామె. అందాల సుందరి అంతలా అడిగారు కాబట్టి.. ఈ శునకాన్ని ఎవరో ఒకరు దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారు.


                                      రామ్ చరణ్ `ధూమ్ ధామ్` ఎదురుచూపు . . . . .  ?
రామ్ చరణ్ దృష్టి మొత్తం ధూమ్ ధామ్ పైనే ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. రామ్ చరణ్ అత్తవారు తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కావటంతో అక్కడ వారు ధూమ్ ధామ్ ఎప్పడని అడుగుతున్నారట. ఛానెల్స్ లో కూడా రామ్ చరణ్ ధూమ్ ధామ్ కి ఏర్పాట్లు అంటూ న్యూస్ లు ప్రసారం చేస్తున్నారు.ఇక రామ్‌చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థమే అందరూ మాట్లాడుకునేంత ఘనంగా జరగనుందని సమాచారం.


 నవంబర్‌లో వీరి నిశ్చితార్థాన్ని జరపడానికి ఇటు చిరంజీవి కుటుంబం అటు కామినేని కుటుంబం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటలు వేదికగా తీసుకోవటం లేదు. హైదరాబాద్‌కి 105 కిలోమీటర్ల దూరంలోని ఉపాసనా తాతయ్య ఉమాపతికి చెందిన దోమకొండగడిని ఈ నిశ్చితార్థానికి వేదికగా చేయనున్నారు . అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే దోమకొండగడికి సంబంధించిన మరమ్మత్తులను ఆరంభించారు.

                                        నేను సాధరణ అమ్మాయిని: హన్సిక
తన నటన చూస్తే తనకే సిగ్గేస్తుందని అందువలన తాను నటించిన చిత్రాలు చూడనని అంటోంది పాలబుగ్గల హన్సిక. ఈ ముద్దుగుమ్మ విజయ్‌కు జంటగా నటించిన వేలాయుధం చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రంపై హన్సిక చాలా ఆశలు పెట్టుకుంది. అయితే వేలాయుధం చిత్రాన్ని అమ్మడు తిలకించలేదట.దీని గురించి హన్సిక మాట్లాడుతూ తాను నటించిన చిత్రాలను తాను చూడనని చెప్పింది.


 ఎందుకంటే కొన్ని సన్నివేశాలలో తననటన తనకే సిగ్గు అనిపిస్తుందని తెలిపింది. లేకపోతే ఆయా సన్నివేశాలలో ఇంకా బాగా నటించవచ్చుననే భావన కలుగుతుందని అంది. కాగా షూటింగ్‌లో నటిస్తున్నంత సేపే నటిగా ప్రవర్తిస్తానని , ఆ తరువాత సాధారణ అమ్మాయిగా నడుచుకుంటానని తెలిపింది. ఎవరితోనూ అధికంగా మాట్లాడనని చెప్పింది.
                                           పూనమ్ పాండే బాత్ రూమ్ వీడియో తొలగింపు..!

 భారత్ ప్రపంచ కప్ గెలిస్తే స్టేడియంలో తన బట్టలు విప్పుతానని ప్రకటించిన ప్రముఖ మోడల్ పూనమ్ పాండే మరోసారి హాట్ హాట్ న్యూస్‌తో వార్తల్లోకెక్కింది. చేతిలో సినిమాలు, రియాల్టీ షోలు లేక పోవడంతోతన అభిమానులను ఉర్రూతలూగించడానికి కొత్త పంథా ఎంచుకుంది. ఏకంగా తాను స్నానం చేసిన తర్వాత టవల్‌తో తుడుచుకునే దగ్గరి నుండి మేకప్ వేసుకునే వరకు అన్ని దృశ్యాలను తనకు తానే చిత్రీకరించుకొని ఓ వెబ్ సైట్‌లో పెట్టింది. ఈ చిత్రం నిడివి మూడున్నర నిమిషాలకు పైగా ఉంది. మిర్రర్ యాక్ట్ షో పేరుతో దానిని వెబ్ సైట్‌లో పెట్టింది.

స్నానం అనంతరం టవల్‌తో బాత్ రూం నుండి బయటకు రావడం, తుడుచు కోవడం, శరీర భాగాలకు స్లో మోషన్‌తో లోషన్ రాసుకోవడం, అద్దం వైపు వెళ్లి మేకప్ చేసుకోవడం తదితర వాటిని వెబ్ సైట్లో పెట్టింది. అంతేకాదు తనకు తానుగానే పదహారు చిత్రాల ఆఫర్లను తిరస్కరించానని ట్వీట్ చేసింది. అయితే వెబ్ సైట్లో పూనమ్ హాట్ వీడియో చూద్దామనుకునే వారిలో చాలా మందికి నిరాశ ఎదురవుతుందట. కాగా ట్రయలర్ తన వెబ్ సైట్లో పెట్టడం విశేషం.


                                           బేబీ షవర్ పార్టీ కి సేక్రేట్ గా ఐష్..!

బాలీవుడ్ స్టార్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బుధవారం రాత్రి సీక్రెట్ గా ఓ పార్టీకి హాజరయింది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఐశ్వర్య కోసం ఆమె సన్నిహితులైన డిజైనర్స్ అబూజానీ, సందీప్ కోస్లాలు బాంద్రాలోని సీమంతం(బేబీ షవర్ పార్టీ) పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. త్వరలో ఐష్ పండంటి కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో బచ్చన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలకాలం గుర్తుండి పోయే వేడుక చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారట. సాంప్రదాయ బద్దంగా పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు, నార్త్ ఇండియా...సౌతిండియా వంటకాలతో వంటలు అదర గొట్టారు.
కాగా...ఐశ్వర్య రాయ్ గర్భవతి అయిన నేపథ్యంలో బెట్టింగ్ ఇప్పటికీ జోరుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆమెకు కవల పిల్లలు, ఆడ బిడ్డ, మగ బిడ్డ అనే అంశాలతో పాటు, ఐశ్వర్య ఎప్పుడు ప్రసవిస్తుంది అనే దానిపై కూడా పందెం రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ పందేలు కాస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పందెం రాయుళ్లు....ఐష్ బిడ్డకు జన్మనిచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.