ప్రముఖ దర్శకుడు, నటుడు దాసరి నారాయణ రావు భార్య దాసరి పద్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందారు. దాసరి పద్మ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Read More . . .
Read More . . .
No comments:
Post a Comment